Home  »  TV News  »  Karthika Deepam2 : జ్యోత్స్నపై దశరథ్ ఫైర్.. దీప ఎమోషనల్!

Updated : Feb 7, 2026


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-587 లో.. దాస్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. నేను సుమిత్ర కూతురు కాదు.. ఇదే కదా మీరు ప్రూ చేయాలనుకుంటున్నారని జ్యోత్స్న అనగానే నీకు ఓ చిన్నకథ చెప్తానని దాస్ అంటాడు. నీ కథలోకో దండం నాన్న.. మగింపు లేని నీ కథలు వింటుంటే మెంటల్ ఎక్కిపోతుందని జ్యోత్స్న అంటుంది. దీపని ఆ ఇంటి వారసురాలిగా చేసేవరకు నేను హ్యాపీగా ఉండనని దాస్ అంటాడు. 

నన్ను నువ్వే కాపాడగలవు.. భార్య చనిపోయింది.. కూతురిని నువ్వే చంపేస్తావా.. ఇదే నా చివరి కోరిక అనుకో నాన్న అని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అది అవ్వదమ్మ అని దాస్ అంటాడు. మరోవైపు అనసూయ, కాంచన ఇద్దరు దీప గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు దీప ఏడ్చుకుంటూ వెళ్ళిందని అనసూయ అడగగానే.. అదేం లేదే మాములుగానే ఉంది అని కార్తీక్ అంటాడు. దీప డల్ గా కూర్చొని ఉంటుంది. అదే సమయంలో కాంచన వచ్చి శౌర్యని రమ్మని చెప్తుంది. అమ్మకి అన్నం తినిపించమని శౌర్యకి కాంచన అనగానే సరేనని శౌర్య అంటుంది. ఆ తర్వాత అన్నం ప్లేట్ తీసుకొని వెళ్ళి దీపని తినమని శౌర్య  అడుగుతుంది. సుమిత్ర గురించి దీప ఆలోచిస్తూ శౌర్యని కసిరేస్తుంది. దాంతో తను భయపడి అన్నం ప్లేట్ పడేసి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఇక తనని దశరథ్ ఆపి.. ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని జ్యోత్స్న అనగానే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడుతానని దశరథ్ అంటాడు. 

ఏంటి డాడి కొత్తగా అని జ్యోత్స్న అనగానే నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని దశరథ్ కోప్పడతాడు. దాంతో శివన్నారాయణ, పారిజాతం అప్పుడే వస్తారు. ఏమైంది ఎందుకు అంత కోప్పడతున్నావని పారిజాతం అడుగగా.. ఇంట్లో సుమిత్ర ఉంది. తనకి టైమ్ కు మందులు ఇచ్చేదెవరు.. తినిపించేదెవరు.. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం అవసరమా అని దశరథ్ ఫుల్ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత అందరు వెళ్ళిపోతారు. మరోవైపు దీపని ఎందుకు అలా ఉన్నావో చెప్పమని కాంచన అడుగుతుంది. కానీ దీప మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తుంది.  కానీ కాంచన అర్థం చేసుకోలేకపోతుంది. కార్తీక్ మనసులో దీప గురించి భాదపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.